HINDI SHAYARI

Please excuse the typos. I am not very good at typing in Hindi. I did my best.
1
एक दो सान्स रोख कर रख्ने का अभ्यस कर लो
य़दि प्यर मे डूब गये, ये बार बार कम अयेग

एक दो आन्सु बहाने का भी आदत अभी से डाल लो
यदि प्रेयसि बिचड गयी, सेह्नना भी बहुत आसन होजयेगा

2.
जिन्दगी की राह मे कितने भि कन्टे हो, फिर भी कट तो रही ना
प्यार भरा ये दिल मे तोडा सा गम भी है, फिर भी डद्द्क तो रही ना

3
३एक कहावत है लोग २५ साल मे ही मर जाते है,
लेकिन उन्हे ७५ साल मे दफ़न किया जता है
अपमन सह्के, समझौता से जीते है लोग,
वोह जीने से बेह्तर मरना ही अच्छा है

4
४झूठा पैसे कितना भी कमालो, तोडा सुकुन तो मिलेगा, तोडा नीन्द तो उड जायेगी
क्या करे, इज्जत की रोटी कमाने जाओ, सुकुन और नीन्द को चोडो, जीनेका क्वयिश भी उड जायेगी!

5
अब्दुल कलाम जी ने खूब कहा था, सपने वो नही आप सो गये और देखे
असली सपने वो होते है, आप को सोने ही नही देते

6
ये दुनिया भी कितना रगीन है, किस किस चीज का स्वाद लू
बस मेरे अर्मनोकी दुनिया मे इतना खो गयहू, जरा अपने आपको पहले खोद्लू 

7
हम मे से कितने लोग जिन्दगी अपने इछा से जीते है
गिरते, उट्ते, गिरते, उट्ते कभी कभी अपना रूह को खो देते है

వస్తాను, మళ్లీ, మళ్లీ వస్తాను


వస్తాను, మళ్లీ, మళ్లీ వస్తాను

మా మామయ్యా ఆకుపత్ని శ్రీనివాస రావు గారి స్మృతిలో 

శారీరకంగా అలసిపోయి భౌతికంగానే వెళ్ళిపోతున్నాను,

మీ గుండెలనుండి, మీ జీవితాలనుండి కాదు.

ఇంకా తనివి తీరలేదు,

వస్తాను. మళ్ళి మళ్ళీ వస్తాను!!

మీ అమ్మ, భాగ్యలక్ష్మి, సంపూర్ణ ఆరోగ్యంతో 

ఆనందంగా ఉండడం నేను స్వయంగా చూడాలి!

వస్తాను. మళ్ళి మళ్ళీ వస్తాను!!

చండీ, హైమా రిటైర్మెంట్ జీవితం నేను చూసి ఆనందించాలి

కావ్య, నిఖిల్ అంచలంచలుగా ఎదగడం నేను చూడాలి

అవ్యక్తతో మొదటిరోజు స్కూలుకు నేనూ వెళ్ళాలి!

వస్తాను. మళ్ళి మళ్ళీ వస్తాను!!

రాణి, విజ్జు ఇంట్లో మరో 42 రోజులుండి వెరైటీ స్కాచులు తాగాలి,

భార్గవ, అనూ ఆఫీసులో నేను ఫోటోగ్రాఫరుగా పని చేయాలి,

బన్న పెళ్లి baraath లో నేను non-stop డాన్స్ చేయాలి,

మీల riddles వేస్తె, నేను టకీమను answer చెప్పాలి,

వస్తాను. మళ్ళి మళ్ళీ వస్తాను!!

పద్మ, సుదర్శన్ ఒక పెద్ద సొంత ఇల్లు కడితే నేనే supervise చేయాలి,

అపర్ణ ఒక బిడ్డను కంటే అది నా గుండెలమీద ఆడుకోవాలి,

అనీష్ అమెరికా మొదటి సంపాదనతో పార్టీ ఇస్తే, నేను తాగి ఊగాలి!

వస్తాను. మళ్ళి మళ్ళీ వస్తాను!!

మాధవి, రమేశులతో పాటు రోహన్ గ్రాడ్యుయేషన్ ceremony నేనూ అటెండ్ కావాలి,

రోహన్ పెళ్లి ఈవెంట్లలో నా సూటు బూటే highlight అవ్వాలి,

రిత్వికును నేను అమెరికా చదువులకు స్వయంగా సాగనంపాలి!

వస్తాను. మళ్ళి మళ్ళీ వస్తాను!!

రవి, శ్రీలతల సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ పార్టీ ఒక emotional స్పీచ్ ఇవ్వాలి

ప్రణవి నేషనల్ Basketball ఛాంపియన్ అయిందని నా చెవులారా వినాలి

ప్రణతి, ప్రణాళి బాగా చదివి, ఉన్నత స్థాయిలో ఉండడం నేను చూడాలి!

వస్తాను. మళ్ళి మళ్ళీ వస్తాను!!

శ్రవణ్ ప్రమోషన్ కొట్టేసినప్పుడు వాని కళ్ళల్లో మెరుపును నేను చూడాలి

అదేరోజు రాత్రి మూడు పెగ్గులేసి, బిర్యాని లాగించాలి

అనన్య డాక్టరో, IAS ఆఫీసరో కావడం నేను చూసి తరించాలి!

వస్తాను. మళ్ళి మళ్ళీ వస్తాను!!

‘మనం’ అందరం ఆకుపత్ని అంటేనే ఆనందానికి ప్రత్యామ్నాయం అని నిరూపించాలి 

ఇంకా తనివి తీరలేదు, వస్తాను మళ్ళీ వస్తాను

మీతోనే ఉంటాను, మీలోనే ఉంటాను!


పేమతో, మీ నాన్న

రచన : విజు కాకతీయ, 31 డిసెంబర్ 2023


ప్రకృతి - వికృతి

విజు చిలువేరు

27 జూన్ 2020


ఎప్పుడూ మనం ప్రకృతినే దోచుకుంటాం 

ఇంకెప్పుడు దాన్నుండి మనం నేర్చుకుంటాం?


వృక్షాల్ని నరికి అందమైన ఇల్లు కట్టాం

పక్షుల గూళ్ళు కొల్ల గొట్టి వాటిని వెళ్ళగొట్టాం 


జంతు చర్మంతో కోటు కుట్టి వేసుకున్నాం

కొన్ని ప్రాణులను సృష్టి నుండే తరిమేసాం


ఎప్పుడూ మనం ప్రకృతినే దోచుకుంటాం 

ఇంకెప్పుడు దాన్నుండి మనం నేర్చుకుంటాం?


సముద్రాన్ని క్షోభపెట్టి చమురెంతో తీస్తాం 

సునామీలాంటి సంక్షోభాలను కొని తెచ్చుకుంటాం  


భూమిని గజాల కొద్దీ పొడిచి నీళ్లు తోడుతాం

తరచూ భూకంప ప్రళయాలకు బలి అవుతాం 


ఎప్పుడూ మనం ప్రకృతినే దోచుకుంటాం 

ఇంకెప్పుడు దాన్నుండి మనం నేర్చుకుంటాం?


కాలుష్యంతో వాతావరణానికే మసి పూసామ్ 

విషవాయువులతో ప్రాణాలనే తీసుకున్నాం 


వికృతమైన చేష్టలతో ప్రకృతితో ఆడుకున్నాం 

దాని తాండవంతో నానా పాట్లు పడుతున్నాం 


ఎప్పుడూ మనం ప్రకృతి నే దోచుకుంటాం 

ఇంకెప్పుడు దాన్నుండి మనం నేర్చుకుంటాం?


తూర్పు - పడమర

ఈ కవిత సగటు మనుషుల గురించి, మిమ్మలి నవ్వించడాని/ఏడిపించడానికి ఓ సగటు మనిషి రాసిన కవిత. ప్రతి పదాన్ని గుచ్చి గుచ్చి పరిశీలించి బుర్ర పాడుచేసుకోకండి. వినండి/చదవండి. మరచిపొండి. అంతే!! 


:::::::ఇక్కడ = అమెరికా. అక్కడ = ఇండియా:::::


ఎక్కడ సెటిల్ అవ్వాలి? ఇండియానా, అమెరికానా?

తేల్చుకోలేక చచ్చిపోతున్నాం ఇక్కడ!


రెండు మూడు పూటలు వంటలక్కడ

రెండు రోజులకొకసారి stove వెలిగితే పండగిక్కడ!


ఎదో విషాదమైతేనే నిశ్శబ్ధంగా ఉంటుందక్కడ

గుండు పిన్ను కింద పడితే panic తో బెదిరిపొతారిక్కడ!


ప్రతి వాడు డాక్టరో ఇంజనీరో అయితీరాల్సిందే అక్కడ

Career విషయం పిల్లలకు 100% ఫ్రీడమ్ ఇవ్వాల్సిందే ఇక్కడ


Fitness అని చెప్పి కొందరు తిని చావడంలేదు అక్కడ, ఇక్కడ

ఈ విషయంలో తేడా లేదేంటండి ఎక్కడా?


ఇండియానా, అమెరికానా?

తేల్చుకోలేక చచ్చిపోతున్నాం ఇక్కడ!


Birthdayను ఆ రోజే సెలెబ్రేట్ చేసుకుంటారక్కడ

పెళ్లికైనా weekendకే  దొరుకుతుంది ముహూర్తమిక్కడ


కార్యక్రమాన్ని తగ్గట్టు చక్కని బట్టలేసుకుంటారక్కడ

మగవాళ్లకు చాలా eventsకు short టీషీర్ట్ డిఫాల్ట్ ఇక్కడ


మామూలు tea నుండి greenteaకి update అయ్యారక్కడ

కాఫీ తప్ప ఇంకో డ్రింకే తాగారిక్కడ


రోజులు మారాయి … Heart attack వొచ్చినా అంబులెన్సే నీగతి అక్కడ, ఇక్కడ

ఈ విషయంలో తేడా లేదేంటండి ఎక్కడా?

ఇండియానా, అమెరికానా?

తేల్చుకోలేక చచ్చిపోతున్నాం ఇక్కడ!


పరిచయం లేకేపోయిన అన్నా, వదినా అని చక్కగా పలుకరిస్తారక్కడ

సొంత అత్తగారిని కూడా Ms. Olivia అని సంబోధిస్తారిక్కడ


ఇంకా పెద్దవాళ్ళకు గౌరవంఇచ్చి మాట్లాడుతున్నారక్కడ

పిల్లలతో కూడా మాట్లాడేముందు కొద్దీసేపు prepare అవ్వాలిక్కడ


నాలుగేళ్ళకొకసారి vacationకు వెళ్తే గొప్పక్కడ

నాలుగు నెలలకొకసారి బ్రేక్ కావాలి మనవాళ్ళకిక్కడ


షాపులో sale పెట్టారెంటే అవసరం లేకున్నా కొనేస్తున్నారు అక్కడ, ఇక్కడ

ఈ విషయంలో తేడా లేదేంటండి ఎక్కడా?


ఇండియానా, అమెరికానా?

తేల్చుకోలేక చచ్చిపోతున్నాం ఇక్కడ!


మర్యాదగా, పద్దతిగా ఉంటె పిచ్చోడనుకుంటారక్కడ

కొద్దిగా అటు ఇటూ కనిపించినా దూరం జరుగుతారిక్కడ


నవ్వినా, హలో అన్నా ‘నేన్నీకు తెలుసా’ అంటారక్కడ

ఎదుటివాన్ని ‘హాయ్’ అనపోతే ‘uncivilized’ అంటారిక్కడ


18 ఏళ్ళు కుర్రాడు తాగకపోతే ఎగతాళి చేస్తారక్కడ

21 ఏళ్ళు దాటకముందు తాగితే బొక్కలో తోస్తారిక్కడ


Love, break-up. Same-to-same అక్కడ ఇక్కడ

ఈ విషయంలో తేడా లేదేంటండి ఎక్కడా?

…………………………………………………………………………………………...

ఈ కవితను ఎంత పొడుగైన రాయొచ్చు ఇక్కడ.

వినడానికి ఓపిక వుండాలిగా అక్కడ? :)


29 ఆగష్టు 2021





మారిపోయింది లోకమంతా

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా 

 

​మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ముసలాయనా

 

పంచగట్టి, బుస్కొటేసి బొరుగోట్టిందే 

షార్టులు టీ షర్టులు నేను కొనుకుంటనే

 

చెడ్డి బనీనేసుకుని తిరుగుతనంటవా

సూసుకో అద్దంలా నిన్ను నువ్వు గుర్తుబడ్తవా?

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా  

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

తోలు చెప్పులేసుకుని బొరుగోట్టిందే

నైకి షూజులేసుకొని జాగింగ్జేస్తనే 

 

ఈ శూజులు పోజులు నీకెందుకయ్య 

నడవలేక ఉర్కలేక పడ్తవయ్యా 

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా  

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

ల్యాండ్ లైన్ల మాట్లాడ్తె బోరుగోడుతుందే 

సెల్లుఫొను కొనుక్కొని మాట్లాడ్తనే  

 

నువ్వు మాట్లాడే దంతగూడ ఉత్తి సోల్లు 

కట్ట లేక సస్త నేను నెల నెల నీ సెల్లు బిల్లు  

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

మనూల్లె  టాకీసుకుబోయ్యి బోరుగోడుతుందే 

పట్నంబొయ్యి IMAX ల సీన్మ సూద్దమే 

 

ఎక్కడ సూస్తె ఏందయ్యా ఆ చెత్త సీన్మాలు

పట్నం బోతే అయితయి బోలెడు పైసలు 

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

ఇంటర్నెట్ కేఫుకుబోయ్యి బోరుగోడుతుందే

మంచి Laptop ఒక్కటి మనం కొనుకున్దామే 

 

email సదవడానికి computer ఎందుకు

10 రూపాయిలకు ప్రింట్ ఔటోస్తది ఇంటిముందుకు 

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

అన్నం కూర తిని తిని బోరుగోడుతుందే

Pizza, burgerలు ఆర్డర్ చేద్దమే 

 

తినాడానికి బాగానేవుంటై ఆ pizzaలు 

కడుపుల గడబడ చేస్తాయి చాన రోజులు 

 

మారిపోయింది లోకమంతా రాములమ్మో 

మనం గూడ మారుదామే చిలకమ్మా

 

మారిపోయింది లోకం కాదు నారాయణా 

మారేది మనిషి బుద్ధి ఓ ముసలాయనా

 

ఈ సైట్ అద్దాలు పెట్టుకొని బోరుగోడుతుందే

నల్లద్దాలు పెట్టుకుంటే హీరో లేక్కుంటనే 

 

హీరో ముచ్చటెందో గాని నాకు తెల్వదు

కుక్కలు ఎంటబడతై  ఫోజులు కొట్టొద్దు

 

లోకమంతా మారినా రాములమ్మో 

మనం అసలే మారోద్దే ఓ చిలకమ్మా 

 

వద్దొద్దు మనకీ కొత్త మోజులు 

నిన్ను నన్ను ముంచుతై పరదేశి పోజులు


మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా

ఓ మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

ఓ మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా -2

చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

జీడికల్లు గుడి కాడా లేడి కళ్ళు చూపిస్తా

రాములవారి పాదాలను దగ్గరుండి మొక్కిపిస్తా

డైరెక్టుగా సీతమ్మదర్శనమే జేపిస్తా

డైరెక్టుగా సీతంమనూ... దర్శనమే జేపిస్తా.

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

పెంబర్తి కాడ నీకు బ్రాసు నెమలిని కొనిపెడత

బానపురం గుల్లే నీకు హనుమంతుని చూపిస్తా

జనగాము టేసంలా చాయి తాగిపిస్తా

జనగాము టేసంలా..... మసాల చయనే తాగిపిస్తా

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

కాజీపేట కాడ నీకు సక్కని గాజులే తొడిపిస్తా

నక్కలగుట్ట తాన నీకు చెక్క బొమ్మలే  కొనిపెడతా

యునివర్సిటీ క్యాంపసంత తిప్పి నీకు చూపెడత

కాకతీయ క్యంపసంతా... తిప్పి నీకు సూపెడ్త

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! -2

 

హనుకొండ చౌరస్తాల మిర్చి బజ్జి తినపెడ్త

అలంకారు టాకీసుల ఇంగ్లీషు సీన్మనే చూపిస్తా

వేయి తంబల గుడినంత దగ్గరుండి చూపెడత

వేయి తంబల గుడినంతా... దగ్గరుండి చూపెడత

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

అశోకు హోటల్లో మటను బిర్యాని తినిపిస్తా

గాలక్సీ స్టుడియోలో కలరు ఫోటోలే దిగిపిస్తా

కాలేజుల పోరగాండ్ల కథలన్నీ చూపెడత

కాలేజుల పోరాగండ్లా... కథలన్నీ  చూపెడత

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

వరంగల్లు టేసను కాడా జార్జేట్ చీరలు కొనిపెడత

బాటా షోరూముల మెరుపు చెప్పులే కొనిపెడత

టాటా షోరూముల లేటెస్టు ఫోనునే ఇప్పిస్త

టాటా షోరూములా... లేటెస్టు ఫోనునే ఇప్పిస్త

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా -౨

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

రామప్ప గుడికు నిన్ను AC కార్ల తోల్కపోత

బద్రకాలి గుల్లే శాకంబరి చూపెడతా

ఓరుగల్లు ఫోర్టుకాడ కాకతీయ గేటునే చూపిస్తా

ఓరుగల్లు ఫోర్టుకాడ... కాకతీయ గేటునే చూపిస్తా

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - 2

 

అడుగుతే నీకోసం చందమామ తెచ్చిపెడతా 

కోరితే నీకోసం కొండలైనా కదిలిపిస్త 

వరంగల్లు మనిషిని నేను మాటమీద నిలబడత 

 

మరదలు పిల్లా చూపిస్తా నా జిల్లా - 2

చూడు చూడవే  పిల్లా వరంగల్లు నా జిల్లా! - ౨

 

సక్కంగుందిరో ఓ బావ నీ జిల్లా - 2

సూపెడితివిరో మరి  ఊళ్లు తిప్పి నీ జిల్లా - 2

 

యునివర్సిటీకి ఫోర్టుకు ఫెమజుగాదు నా జిల్లా

బోలెడంత ప్రేమగల్లది నా తల్లిగారి జిల్లా

మర్యాదకు మారుపేరు నల్లగొండ నా జిల్లా 

మర్యాదకు మారుపెరూ... నల్లగొండ నా జిల్లా

LoL (లాఫ్ అవుట్ లౌడ్)

కుడిచేతితో ఆపరేట్ చేస్తాడు వాట్సాప్పు

ఎడమచేతిలో చూస్తే ఓ కాఫీ కప్పు

వాన్నీ పలకరించండమే ఓ పెద్ద తప్పు

ఈ టెక్నాలజీతో వచ్చిందండి మనకు పెద్ద ముప్పు!

 

24 ఘంటలు వాడి నేస్తం ఫేసుబుక్కు

4-5 సార్లు పిలిచాక ఇస్తాడొక వింత లుక్కు

రోడ్డుమీద ఎటు వెళ్తున్నాడో తెలియదు వాడికి దిక్కు

ఈ టెక్నాలజీతో తెచ్చిపెట్టిందండి మనకో పెద్ద చిక్కు!

 

అవసరమా వెళ్లిన ప్రతి చోట ఓ సెల్ఫీ ఫోటో

ప్రతి celebrity తో ఆ వెదవ పోజు ఎందుకటో

అది ఫేసుబుక్కులో పెట్టెయ్యడమో వాడి మోటో

ఈ టెక్నాలజీ మన జీవితాల్ని ఎం చేయనుందేంటో

 

రెండేళ్ల పిల్లడు ఆపరేట్ చేస్తున్నాడు ఐపాడు (iPad)

తల్లి అన్నం తినిపిస్తున్నప్పుడు అదొక్కటే వాడికి తోడు

ఆవిడేంచేస్తుంది పాపం పడలేదు వాడి గోడు

ఈ టెక్నాలజీతో మారిపోయాడండి ప్రతివాడు!

 

ఈ మధ్య చేసి చూసారా ఎవరికైనా ఓ casual  కాల్

చేస్తే గనక అవుతుంది దాని గతి వాయిస్ మెయిల్

మానేసాం మనం చెక్ చేయడం పర్సనల్ email

కొత్త టెక్నాలజీ రాగానే పాతవవుతున్నవి ‘ఫార్ సేల్’!

 

వస్తూనే వున్నాయి 2G, 3G, 4G…5G

మన వాడకానికి ప్రతి వెర్షన్ అవుతుంది ‘మాజి’

స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతివాడు ఒకటే బిజీ

ఈ టెక్నాలజీ చేస్తోంది ప్రతొక్కణ్ణి క్రేజీ!

 

9 జూన్ 2017


HINDI SHAYARI

Please excuse the typos. I am not very good at typing in Hindi. I did my best. 1 एक दो सान्स रोख कर रख्ने का अभ्यस कर लो य़दि प्यर मे डूब ...